కర్ణాటక సంగీతం స్వరజతి 2 (సాంబ శివ)

రాగం ఖమాస్ (మేళకర్త 28, హరికాంభోజి జన్యరాగ)

ఆరోహణ: స . . . . మ1, గ3 మ1 . ప . ద2 ని2 . స’
అవరోహణ: స’ . ని2 ద2 . ప . మ1 గ3 . రి2 . స

తాళం: చతుస్ర జాతి త్రిపుట తాళం (ఆది)
రూపకర్త: చిన్నకృష్ణ దాసర్

పల్లవి
సాంబశివాయనవే రాజితగిరి
శాంభవీమనోహరా పరాత్పరా కృపాకరా శ్రీ

చరణం 1
నీవే గురు దైవంబని యే వేళను సేవింపుచు సదా మదిని శివ

చరణం 2
పరమ దయానిధి వనుచు మరువక నా హృదయమున
మహాదేవ మహాప్రభో సుందర నయన సురవర దాయక భవభయ హరశివ

చరణం 3
స్థిర మధురాపురమున వరములొసగు హరుని నిరతమును దలచి

చరణం 4
శ్రీ శుభకర శశి మకుటధర జయ విజయ త్రిపురహరా-
శ్రితజన లోలాద్భుత గుణశీలా కృతనుతపాలా పతితుని లోలా-
ముదంబల రంగ పదాబ్జములందు పదంబులుజేర్చు పశుపతిని
జ్ఞానము ధ్యానము స్నానము పానము
దానము మానము అభిమానమనుచు
కనికరమున చరణంబులు కను-
గొను శృతులన్నుతుల శరణనుచు (సాంబ)

చరణం 5 (ఖండ గతి – 5 కాల)
సారెసారెగు నీ నామ మంత్రం కోరినాను నీ పాదాంబుజ మంత్రం
దాసుడౌ చిన్ని కృష్ణునికి దిక్కు నీవేయని శొక్కనాథుని నమ్ముకొని

స్వరాః

పల్లవి

Browse Related Categories:


Source: Vignanam

Scroll to Top